కత్తులు, బండరాళ్లతో దాడి..
హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారి–44పై పెబ్బేరు సమీపంలో ఈ నెల 18న తెల్లవారుజామున చోటుచేసుకున్న దారిదోపిడీ ఘటనలో నిందితులను రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుపతికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో పెబ్బేరు సమీపంలో ఉన్న ట్రక్ బే వద్ద విశ్రాంతి కోసం ఆగారు. అక్కడే చెరుకు ట్రాక్టర్లలో కూలీల రూపంలో మాటు వేసుకున్న ఉన్న పార్థీగ్యాంగ్ వాహనంలో ఉన్న వారిపై కత్తులు, బండరాళ్లలో పాశవికంగా దాడి చేసి దారిదోపిడీకి పాల్పడ్డారు. వారిని తీవ్రంగా గాయపర్చి, మహిళల వద్ద ఉన్న 13 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఘటనా ప్రదేశంలోనే ఉండి తీరిగ్గా చూస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల ప్రవర్తనపై వచ్చిన అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్ జిల్లాలకు చెందిన పార్థీగ్యాంగ్ పనిగా పోలీసులు తేల్చారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment