వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నూతనంగా నియామకమైన మల్టీపర్సన్ హెల్త్ అసిస్టెంట్లు, పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులు సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ కార్యక్రమాలైన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తించడం, పర్యవేక్షించడం చేయాలన్నారు. గర్భిణుల ఆరోగ్యం, మాతాశిశు సంరక్షణ, గర్భిణులు, చిన్నారుల ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను అన్ని పల్లె దవాఖానా పరిధిలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. పల్లె దవాఖానాల్లో నూతనంగా నియమించబడిన సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకట్‌దాస్, ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణమోహన్, డీపీఓ రేనయ్య, ఏపీఓ విజయ్‌కుమార్, మల్లేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment