ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర
దుర్వాసుల చెరువు
నుంచి కారిడార్ చేపట్టాలి
మన్ననూర్: శ్రీశైలం– హైదరాబాద్ ఎలివెట్ హైవే కారిడార్‌ను మన్ననూర్ సమీపంలోని దుర్వాసుల చెరువు నుంచి ప్రారంభించాలని అమ్రాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం అచ్చంపేటలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌లకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తలపెట్టిన హైవే కారిడార్ అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఏర్పాటు చేస్తే మన్ననూర్‌లోని హైవేపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది వ్యాపారులు వీధిన పడుతారన్నారు. నల్లమల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏ ర్పాటు చేయతలపెట్టిన హైవే ఎలివేట్ కారిడార్‌ను మన్ననూర్ రెండో చెక్‌పోస్టు దుర్వాసుల చెరువు నుంచి ప్రారంభించేలా ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలని కోరారు. ఈ కారిడార్ ఉద్దేశం వన్యప్రాణుల మనుగడ కోసమేనని గమనించి ఉన్నతాధికారులు నిర్ణయా లు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అచ్చంపేట: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎంపీ మల్లురవి అన్నారు. సోమవారం అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల పేరుతో వ్యక్తులను అవమానించడం తగదని, ఈ వ్యాఖ్యల వల్ల దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అమిత్‌షా మాటలతో అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాడ్ చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి అంబేడ్కర్ లేకుంటే అమిత్‌షా ఎంపీ ఎలా అయ్యేవారో చెప్పాలన్నారు. మతోన్మాద భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించడం వీలు కావడం లేదనే కుట్రతో బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, నాయకులు గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, రామనాథం, కాశన్నయాదవ్, మల్లికార్జున్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment