క్షయ ముక్త్ భారత్ పూర్తిచేయాలి
బిజినేపల్లి: ప్రభుత్వం సూచించినట్లుగా వంద రోజుల క్షయ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్ అన్నారు. క్షయ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ గుర్తించిన క్షయ రోగులకు శిబిరంలో తెమడ, ఇతర పరీక్షలు చేయాలని సూచించారు. సోమవారం మండలంలోని పాలెం, బిజినేపల్లి, లట్టుపల్లి పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన అందరికీ సాధారణంగా అధిక ఒత్తిడి, డయాబెటిస్ పరీక్షలు చేయాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సూచించిన మందులను నెలకు సరిపోను అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింట సర్వే నిర్వహిస్తూ గర్భిణులను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సత్యనారాయాణ, శివకుమార్, ప్రసన్న, మేఘనా, వైద్య సిబ్బంది చంద్రశేఖర్, యాదగిరి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment