పోలీసుల సేవలపై అభిప్రాయాలు చెప్పండి
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషిచేస్తున్నారని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. తెలంగాణ పోలీసుల సేవలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల సేవలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లో ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, ఈ–చాలన్, పాస్‌పోర్ట్ ధ్రువీకరణ తదితర అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. క్యూఆర్ కోడ్‌లను జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్లతోపాటు డీఎస్పీ, సీఐ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అంగవైకల్యాన్ని
తొలి దశలోనే గుర్తించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: అంగవైకల్యాన్ని తొలి దశలోనే గుర్తించి దాని బారినపడకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాతీయ దివ్యాంగుల సాధికారత సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లకు అంగవైకల్యంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అంగవైకల్యంపై సరైన అవగాహన కల్పించడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంగవైకల్యాన్ని నివారించవచ్చని చెప్పారు. రాష్ట్ర శిక్షకులు హృషికేశ్ దేశ్‌పాండే మాట్లాడుతూ గర్భిణిగా ఉన్నప్పుడు, కాన్పు సమయంలో, ప్రసవించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు, చికిత్సల వలన అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. శిశువు తొలి దశలోనే గుర్తించి శస్త్రచికిత్స, కొన్ని ఉపకరణాలను అమర్చడం వలన, ప్రత్యేక శిక్షణ, స్పీచ్ థెరపీ తదితర పద్ధతులు పాటిస్తే అంగవైకల్యాన్ని పూర్తిస్థాయిలో అధిగమించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ @ రూ.7,010
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు రైతులు 806 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకొచ్చారు. అత్యధికంగా క్వింటాల్ రూ.7,010, కనిష్టంగా రూ.5,552, సరాసరిగా రూ.6,620 ధర లభించింది. అలాగే కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,070, కనిష్టంగా రూ.6,010 ధర వచ్చింది. మార్కెట్ వైస్ చైర్మన్ పండితరావు, కార్యదర్శి భగవంతు టెండర్ ప్రక్రియను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment