పరోపకార తత్వంతో జీవితానికి సార్థకత
ఉప్పునుంతల: ప్రతిఒక్కరూ స్వార్థం వీడి ఆపదలో ఉన్నవారికి మనకున్నంతలో సహాయం చేస్తూ జీవితాలను సార్థకత చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని ప్రసిద్ధిగాంచిన మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ పాలక మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పాశ్చాత్య పోకడలతో మన సంస్కృతి పూర్తిగా ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రకృతి ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆడంబరాల పోయి ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. మంచి ఆలోచన విధానాలతో, భక్తిభావంతో జీవించాలని చెప్పారు. గ్రామాల్లో విద్య, వైద్యం తదితర సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతత, మనిషిలో మార్పు తీసుకువచ్చే ఆలయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మామిళ్లపల్లి ఆలయానికి సంబంధించిన వందల ఎకరాల భూములను రక్షించుకుంటే ఆదాయం సమకూర్చుకొని అభివృద్ధి చేసుకుంటే భక్తుల ఆదరణ పెరుగుతుందని చెప్పారు. భూముల పరిరక్షణలో తన పూర్తి సహకారంలుంటుందన్నారు. ఆలయం వద్ద భక్తుల కోసం మౌలిక వసతుల కల్పన కోసం రూ.25 లక్షలు నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజవర్గంలోని ఆలయాల అభివృద్ధితోపాటు పర్యాటక రంగం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారావు, సభ్యులు గణేష్‌గౌడ్, స్వరూప, శ్రీనివాసులుగౌడ్, కృష్ణయ్య, ప్రదీప్ ప్రసాద్, వేణుగోపాల్‌రావును మంత్రి సన్మానించి అభినందించారు. జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ రజిత, ఆయా ఆలయాల కమిటీల చైర్మన్లు మాధవరెడ్డి, రాములునాయక్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఆర్డీఓ మాధవి, ఈఓ నర్సింహులు, నాయకులు అనంతరెడ్డి, నర్సింహారెడ్డి, అనంతప్రతాప్‌రెడ్డి, జంగిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నివేదిత, అరుణ, సరిత, పుష్పవతి, లక్ష్మీదేవమ్మ, గోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment