ఊర్కొండపేట ఆలయ అభివృద్ధికి కృషి
ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలయంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు. అలాగే పాలక మండలి సభ్యులు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి భక్తుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు పాలక మండలి చైర్మన్‌గా నారెడ్డి సత్యనారాయణరెడ్డి, సభ్యులుగా వెంకటమ్మ, రజిత, బొందయ్యగౌడ్, గోపాల్‌నాయక్, వెంకటయ్య, మల్లేష్‌యాదవ్, రమేష్, విజేందర్, ఆంజనేయులు, బంగారయ్య, వెంకటయ్య, పత్యానాయక్, మహేష్‌స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిఖిల్‌రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణాధరి, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment