‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఈవీఎం గోడౌన్ పరిశీలన
జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. సీసీటీవీ ద్వారా అక్కడ భద్రపరిచిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అలాగే ఈవీఎం గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును సమీక్షించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు మహ్మద్ హుస్సేన్, బాలకృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జీహెచ్‌ఎంల సంఘం డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు హెచ్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డీఈఓ రమేష్‌కుమార్, హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, హెచ్‌ఎంలు తిరుపతయ్య, భాస్కర్‌రెడ్డి, బషీర్ అహ్మద్, లత తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
వంగూరు: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ప్రారంభించిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మండలంలోని కొండారెడ్డిపల్లిలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్, ఫోర్‌లైన్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సెంటర్ లైటింగ్‌తోపాటు కొండారెడ్డిపల్లిలోని ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు నెలల్లో ఫోర్‌లైన్ రోడ్డు పనులు పూర్తిచేయాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంలోకి వస్తే గ్రామస్తులకు మేలు జరుగుతుందన్నారు. ఇంటి యజమానులు విద్యుత్‌ను వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను అమ్ముకొని లాభం పొందవచ్చన్నారు. ప్రత్యేకాధికారి రమేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment