No Headline
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానమైన రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం, పంపుహౌస్, మోటార్ల బిగింపు పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టిన ప్రధాన కాల్వ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు.
ఈ పనులు పూర్తిచేసేందుకు సంబంధిత కాంట్రాక్టు సంస్థ ఇటీవల వ్యయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రధాన కాల్వ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు మరింత కాలం పట్టనుంది. అలాగే వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ విస్తరణ పనులు, వీటి నుంచి పంప్‌హౌస్ వరకు బండ్ నిర్మాణ పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment