‘నిరుద్యోగ భృతి’పై నిర్లక్ష్యం తగదు
నాగర్‌కర్నూల్‌రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలుపర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డీవైఎఫ్‌ఓ జిల్లా సహాయ కార్యదర్శి నాగపూర్ మధు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న కొత్త పథకాలతో పాటు నిరుద్యోగ భృతిని అమలుపర్చాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నాగరాజు, మల్లిఖార్జున్, జీవన్, శివ, భరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment