తాడూర్: నిరంతర సాధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని.. పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. బుధవారం తాడూర్ మండలంలోని పాపగల్, శిర్సవాడ, ఇంద్రకల్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షలకు మరో 55 రోజులు మాత్రమే ఉన్నాయని.. ప్రతి వి ద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రణాళికా బద్ధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో ఆలో చనా శక్తిని పెంపొందించి, వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. డీఈఓ వెంట ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment