గ్రామసభల్లో ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రజల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉండగా.. అఽధికారులు జాబితాను సిద్ధం చేశారు. భూమి లేని పేదలు కనీసం 20 రోజులపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేయాలన్న నిబంధనను సైతం చాలా చోట్ల పాటించకుండానే అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా వ్యవసాయ పనులకు ఎక్కువ కూలీ ఉండటంతో ఆ పనులకే వెళ్లామని.. ఉపాధి పనులకు వెళ్లని కారణంగా అనర్హులంటూ ఎలా పేర్కొంటారని రైతు కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ పనులతో సంబంధం లేకుండా భూమి లేని నిరుపేదలకు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment