స్పష్టత కరువు..!
లబ్ధిదారుల జాబితాపై గందరగోళం
వివరాలు 8లో u
●
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలకు అధికారులు ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలపై గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అనర్హులకు జాబితాలో చోటు కల్పించి.. తమను నిర్లక్ష్యం చేశారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే మళ్లీ దరఖాస్తులు ఇస్తే స్వీకరిస్తామని.. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని అధికారులు చెబుతున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 137 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 28 వార్డుల్లో సభలను నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుదారులు పోటెత్తా రు. మొత్తం 9,918 అర్జీలను అధికారులకు సమ ర్పించారు. ఈ నెల 24 వరకు గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
కొత్త రేషన్‌కార్డుల మంజూరుతో పాటు రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గతంలోనే ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించింది. ప్రభు త్వానికి అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు ప్రభుత్వ సాయాన్ని అందించాలని నిర్ణయించగా.. లబ్ధి దారుల జాబితాను గ్రామసభల్లో ప్రకటిస్తున్నా రు. అయితే కొన్ని గ్రామాల్లో ఆయా పథకాలకు సంబంధించిన జాబితాల్లో దరఖాస్తుదారుల పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మరికొన్ని గ్రామాల్లో అసలు జాబితాలో పేర్లు చదవకుండానే నామమాత్రంగా గ్రామసభలను ముగిస్తున్నారు. లింగాల మండలంలోని పలు గ్రామాల్లో జాబితాలోని పేర్లు వెల్లడించలేదు. తర్వాత గ్రామపంచాయతీ భవనంలో అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలకు అధికారులు సిద్ధం చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేదా అని ఆందోళన చెందు తున్నారు. అయితే ప్రజల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నా.. ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులకే మోక్షం లేదని, మళ్లీ వచ్చేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఈ విష యంపై కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో జరిగిన గ్రామసభ రసాభాసగా మారింది. నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరుకాగా.. గ్రామస్తులు చాలా మంది తమ పేర్లు జాబితాలో లేవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని.. అర్హులైన వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తి మ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో గ్రామసభలో రుణమాఫీ పథకాన్ని తమకు వర్తింపజేయలేదని ఆర్డీఓ సురేశ్‌ను రైతులు ప్రశ్నించారు.
జాబితాలో పేర్లు లేక..
దరఖాస్తు చేసుకున్నా పేరు రాలేదు..
నాకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈసారి లిస్టులో నా పేరు రాలేదు. మళ్లీ దరఖాస్తు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈసారైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వాలి.
– నారోజు కిరణ్‌చారి,
గోకారం, చారకొండ మండలం
జిల్లాలో 137 గ్రామ,
28 వార్డు సభల నిర్వహణ
పలు చోట్ల నామమాత్రంగా సభలు
అర్హుల జాబితా సైతం
వెల్లడించని అధికారులు
రెండోరోజు 9,918 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment