సాక్షి ‘స్పెల్ బీ’కి అపూర్వ స్పందన
నల్లగొండ రూరల్: సాక్షి స్పెల్‌బీ మ్యాథ్స్ బీ రెండో లెవెల్ పరీక్షకు అపూర్వ స్పందన లభించింది. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య హైస్కూల్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బీ పరీక్షకు మెయిన్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారు వ్యవహరించారు. మిర్యాలగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, వర్డ్ అండ్ డీడ్ స్కూల్, నార్కట్‌పల్లిలోని శ్రీ విద్యాపీఠ్ స్కూల్ విద్యార్థులు స్పెల్ బీ రెండో లెవెల్ పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష రాశారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ కందికట్ల రుక్మాధర్, యాడ్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ రాపోలు నాగేశ్వర్‌రావు, రిపోర్టర్ కుంభం వెంకటేశ్వర్లుగౌడ్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్, సాక్షి టీవీ కెమెరామెన్ శ్రీనివాస్‌గౌడ్, ఏకలవ్య స్కూల్ ఉపాధ్యాయుడు వేణుగోపాలచారి, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
కొత్త పదాలు నేర్చుకున్నా
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బీ పరీక్షతో కొత్త పదాలు నేర్చుకున్నా. మొదటి స్థాయి పరీక్ష పాసై రెండో లెవెల్ పరీక్ష రాశాను. కొత్త అంశాలు తెలుసుకోవడం ఆసక్తి కలిగించింది.
– జస్విత, 6వ తరగతి,
శ్రీ విద్యాపీఠ్ స్కూల్, నార్కట్‌పల్లి
భయం పోయింది
పరీక్ష అంటే భయంగా ఉండేది. సాక్షి స్పెల్ బీ రాయడంతో భయం పోయింది. ఫస్టు లెవెల్ పరీక్ష పాసై రెండో లెవెల్ పరీక్ష రాయడంతో ఆందోళన అనిపించలేదు.
– సాయిపూజ, లిటిల్ ఫ్లవర్ స్కూల్,
9వ తరగతి, మిర్యాలగూడ
అక్షర దోషాలు
తెలుసుకున్నా
పరీక్ష రాయడం వల్ల ఇంగ్లిష్ పదాల్లో అక్షర దోషాలు తెలుసుకున్నా. ఈ పరీక్ష వల్ల భవిష్యత్‌లో రాయబోయే పరీక్షలకు ఎలా జాగ్రత్త పడాలో తెలిసింది.
– తరుణశ్రీ, 4వ తరగతి,
వర్డ్ అండ్ డీడ్ స్కూల్, మిర్యాలగూడ
ఆనందంగా ఉంది
ఫస్టు లెవెల్ పరీక్ష పాసై రెండో లెవెల్ పరీక్ష రాయడం ఎంతో ఆనందంగా ఉంది. పోటీ విధానం తెలిసిపోయి మరింత పట్టుదలతో చదివేందుకు పరీక్ష ఉపయోగపడింది.
– కె. అస్వతి, 9వ తరగతి,
లిటిల్ ఫ్లవర్ స్కూల్, మిర్యాలగూడ
పోటీ పరీక్షలు ఎలా రాయాలో తెలిసింది
అక్షర దోషాలు తెలుసుకోవడంతోపాటు పోటీ పరీక్షలు ఎలా రాయాలో ఈ పరీక్ష వల్ల తెలిసింది. మరింత పట్టుదలతో చదవడంతోపాటు అక్షర దోషాలు లేకుండా పరీక్ష రాశా.
– వైభవ్, 2వ తరగతి,
శ్రీవిద్యాపీఠ్ స్కూల్, నార్కట్‌పల్లి
విద్యార్థులకు
ఎంతో ప్రయోజనం
స్పెల్ బీ పరీక్ష రాయడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అక్షర దోషాలు లేకుండా, పరీక్ష అంటే భయం లేకుండా, పెరుగుతున్న పోటీ విధానంపై అవగాహన కలుగుతుంది.
– శౌరి, ఉపాధ్యాయుడు,
శ్రీవిద్యాపీఠ్ స్కూల్, నార్కట్‌పల్లి
పోటీతత్వం
పెరుగుతుంది
స్పెల్ బీ పరీక్ష వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. భవిష్యత్‌లో రాయబోయే అన్ని పరీక్షలకు పోటీ ఉంటుంది. పోటీ పరీక్షలో విజయం సాధించే మెళకువలను ఇలాంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. – గాత్రిశ్రీ, 2వ తరగతి,
వర్డ్ అండ్ డీడ్ స్కూల్, మిర్యాలగూడ
విద్యార్థుల్లో
భయం పోతుంది
ఇలాంటి పోటీ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థుల్లో భయం, ఆందోళన పోతుంది. పరీక్షల్లో అవలంబించాల్సిన నైపుణ్యం, మెళకువలు తెలిసిపోతాయి.
– జయరాజన్, ప్రిన్సిపాల్,
లిటిల్ ఫ్లవర్ స్కూల్, మిర్యాలగూడ
ఇంగ్లిష్‌లో కొత్త పదాలు తెలుసుకుంటారు
స్పెల్ బీ పరీక్ష వల్ల విద్యార్థులు ఇంగ్లిష్‌లో కొత్త పదాలు తెలుసుకుంటారు. ఒక అక్షరంతో ఎలా అర్థం మారుతుందో విద్యార్థులకు తెలిసిపోతుంది. విద్యార్థి దశలో ఇలాంటి పరీక్ష రాయడం వల్ల ఉద్యోగ పోటీ పరీక్షలు తేలికగా రాస్తారు.
– ఎండీ.ఖలీమ్, కరస్పాండెంట్, వర్డ్ అండ్ డీడ్ స్కూల్, మిర్యాలగూడ
పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు
నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య స్కూల్‌లో పరీక్ష నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment