ఉపాధ్యాయ ఓటర్లు 24,905
నల్లగొండ: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదలకు యంత్రాంగం సిద్ధమైంది. సోమవారం తుది జాబితా విడుదల కానుంది. నవంబర్ 23న ముసాయిదా ప్రకటించగా 22,554 మంది ఓటర్లు నమోదయ్యారు. దరఖాస్తుల గడువు పెంచడంతో మరో 2,351 ఓటర్లు పెరిగారు. దీంతో 12 జిల్లాల్లో ఓటర్లు 24,905 మందిగా నమోదయ్యారు. మహిళా ఓటర్లు 9,965, పురుషులు 14,940 మంది ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,483 మంది ఓటర్లు ఉన్నారు.
27వేల దరఖాస్తులు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం 2025 మార్చి 29తో ముగియనుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు పాత ఓటర్ల జాబితా రద్దు చేసి తిరిగి కొత్త ఓటు నమోదుకు శ్రీకారం చుట్టింది. గత సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితా రద్దు చేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అక్టోబర్ 1 నుంచి ఉపాధ్యాయులంతా తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో 27 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను ఆమోదించి ముసాయిదా ఓటర్లు జాబితాను నవంబర్ 23న ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఓటు నమోదుకు మళ్లీ అవకాశం కల్పించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఈనెల 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
ఫ మహిళా ఓటర్లు 9,965..
పురుషులు 14,940 మంది
ఫ 12 జిల్లాల్లో 200 పోలింగ్ కేంద్రాలు
ఫ నేడు ఓటర్ల తుది జాబితా విడుదల
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల వివరాలు..
జిల్లా పీఎస్‌లు పురుషులు సీ్త్రలు మొత్తం
భువనగిరి 17 595 326 921
సూర్యాపేట 23 1,690 947 2,637
నల్లగొండ 37 2,688 1,795 4,483
Comments
Please login to add a commentAdd a comment