సంకెళ్లతో సమగ్రశిక్షా ఉద్యోగుల నిరసన
నల్లగొండ : రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె బుధవారం 23వ రోజు కొనసాగింది. ఉద్యోగులు సంకెళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం పే స్కేల్ అమలు చేస్తూ విద్యా శాఖలో విలీనం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. వారికి టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇరుగు శ్రీరాములు, బత్తిని భాస్కర్, పాపిరెడ్డి, మిర్యాల మురళి, శ్రీనివాస్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు, కంచర్ల మహేందర్, క్రాంతికుమార్, కొండ చంద్రశేఖర్, ఎం.నీలాంబరి, గుమ్మల మంజులారెడ్డి, వి.సావిత్రి, పుష్పలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment