ఆపరేషన్ చబుత్ర విజయవంతం
జిల్లా వ్యాప్తంగా 246 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
నల్లగొండ క్రైం : నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ చేపట్టిన ఆపరేషన్ చబుత్ర విజయవంతమైంది. గతంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలతోపాటు రాష్ట్ర, జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు విషాదఛాయలు నింపాయి. శ్రీయాక్సిడెంట్ ఫ్రీ –ఇన్సిడెంట్ ఫ్రీశ్రీ లక్ష్యంతో 2024 డిసెంబర్ 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు రోడ్లపై తిరిగే వారిని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలు సీజ్ చేయడం, డ్రంక్ అండ్‌డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో 31న రాత్రి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. నల్లగొండలో భద్రతను ఎస్పీనే స్వయంగా పర్యవేక్షించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయించారు. అంతకు రెండు రోజుల ముందు నుంచే పోలీస్ శాఖ చేపట్టిన తనిఖీల కారణంగా మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో మందు, విందు పార్టీలు చేసుకోకుండా పోలీసులు కట్టడి చేశారు. పోలీసులు తనిఖీలతో అప్రమత్తమైన మందుబాబులు, పోకిరీలు రోడ్లపై కనిపించలేదు.
31న 246 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..
2024 డిసెంబర్ 31న అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా 246 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పట్టుబడిన వారందర్ని గురువారం కోర్టులో హాజరు పరచనున్నారు. అత్యధికంగా నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు 39 కేసులు నమోదు చేయగా మిర్యాలగూడలో 22, నకిరేకల్‌లో 19, నల్లగొండ రూరల్‌లో 17, నల్లగొండ టూటౌన్‌లో 13, నార్కట్‌పల్లి, వాడపల్లి, అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్లలో 10 చొప్పున, కొండమల్లేపల్లి, నిడమనూరు, చందంపేట, నేరడుగొమ్ము స్టేషన్లలో రెండు చొప్పున కేసులు నమోదు చేశారు.
29, 30 తేదీల్లో 128 కేసులు..
పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యగా 2024 డిసెంబర్ 29, 30 తేదీల్లో చేపట్టిన తనిఖీల్లో 128 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో వారితోపాటు కుటుంబ సభ్యులకు మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. పట్టుబడిన వారికి కోర్టు రూ.1లక్షా 19 వేలు జరిమానా విధించింది. 62 పెట్టి కేసుల్లో 54 మందికి రూ.56 వేలు జరిమానా విధించగా, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి రూ.3,51,000 జరిమానా విధించింది.
వేడుకలు ప్రశాంతంగా జరిగాయి
యాక్సిడెంట్ ప్రీ ఇన్సిడెంట్ ప్రీ లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలు మంచి ఫలితాన్నిచ్చాయి. 31న అర్ధరాత్రి ఎలాంటి సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా నూతన సంవత్సరంలోకి జిల్లా ప్రజలను సంతోషంగా జరుపుకునేలా చేశాం. నేనే స్వయంగా జిల్లా కేంద్రంలో భద్రతను, తనిఖీలను పర్యవేక్షించాను. జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశాను.
– శరత్‌చంద్ర పవార్, ఎస్పీ
రూ.30 కోట్ల మద్యం తాగారు..
జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2024 డిసెంబర్ 30, 31 తేదీల్లో మందుబాబులు రూ.30 కోట్లు మద్యం తాగారు. డిసెంబర్ 2023న 30, 31 తేదీల్లో రూ.26 కోట్లు మద్యం తాగగా.. ఈసారి రూ.4 కోట్ల మద్యం అదనంగా తాగేశారు. ప్రతి నెల సాధారణంగా రూ.140 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. డిసెంబర్‌లో మాత్రం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.
ఫ భద్రతను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ
ఫ రోడ్డుపై కనిపించని పోకిరీలు, మందుబాబులు
ఫ ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment