కొత్త సహకార సంఘాలు
ఫ 26 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
నల్లగొండ అగ్రికల్చర్ : కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి రెండవ వారంలో ముగియనుంది. ఈలోపే కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సహకార శాఖ కోరింది.
2013 తర్వాత కొత్త కేంద్రాలు లేవు..
చాలా మండలాల్లో ఒకటి, రెండు ఉండడం.. కొన్ని చోట్ల అసలే లేకపోవడం, మరికొన్ని చోట్ల నాలుగు, మూడు గ్రామాలకు కలిపి సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాలు అందుబాటులో లేక రైతులకు సేవలు అందడం లేదు. 2013 తరువాత కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు కాలేదు. అయితే.. 2023లోనే కొత్త సహకారం సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు జిల్లా సహకార శాఖ జిల్లాలో కొత్తగా 26 సంఘాలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment