పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి

Published Mon, Jan 6 2025 7:36 AM | Last Updated on Mon, Jan 6 2025 7:36 AM

పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి

పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి

నల్లగొండ : పంచాయతీ కార్యదర్శలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, సెక్రటరీ శేఖర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఎన్‌జీవో భవన్‌లో ఆదివారం పంచాయతీ కార్యదర్శుల పోరం జిల్లా ఈసీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.ఖాసీం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్‌ పరీక్షలకు సెలవుపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులను రీజాయినింగ్‌ చేసుకోకుండా పెండింగ్‌లో ఉంచడం, రెగ్యులరైజ్‌ తదితర సమస్యలను కలెక్టర్‌కు విన్నవించి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఈ పంచాయతీ ఆపరేటర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సందీప్‌ ఆ యూనియన్‌ను టీఎన్‌జీఓలో విలీనం చేశారు. కార్యక్రమంలో ఎండీ.షఫీ, జి.సతీష్‌, గీతాంజలి, రవికుమార్‌, కె.రాజు, ఎండీ.సత్తార్‌, గిరి, శివ, వెంకట్‌, రజియా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement