బజ్జీలు వేసి నిరసన
నల్లగొండ టౌన్ : సమగ్రశిక్షా ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కలెక్టరేట్ ఎదుట బజ్జీలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ 27 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో కంచర్ల మహేందర్, క్రాంతికుమార్, కొండ చంద్రశేఖర్, నీలాంబరి, గుమ్మల మంజులారెడ్డి, మేడి సావిత్రి, వి.సావిత్రి, పాలడుగు పుష్పలత, సాయిలు, వెంకట్, జి.వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment