ఉపాధి కల్పించాలని కలెక్టరేట్ ఎదుట దర్నా
నల్లగొండ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ గిరిజన రైతులు ప్రభుత్వాన్ని కోరారు. దామరచర్ల మండలం వీర్లపాలెం రెవెన్యూ శివారులోని దుబ్బతండాకు చెందిన గిరిజన రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం 2006–07లో భూముకు పట్టాలు ఇచ్చిందని.. భూములు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కింద పోవడంతో జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో శ్రీను నాయక్, ముడావత్ సైదా నాయక్, రాముడు, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment