అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య
మిర్యాలగూడ టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను (ప్రీ స్కూల్) బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, రాష్ట్ర సీ్త్ర, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. సోమవారం ఆమె సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణితో కలిసి మిర్యాలగూడ పట్టణం విద్యానగర్‌లోని సుభాష్‌నగర్ అంగన్‌వాడీ–2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలను ఆట–పాటలు, నేర్చుకున్న అక్షరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ స్థాయిలో విద్యను అందిస్తామన్నారు. ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన మెటీరియల్, యూనిఫాం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేశామని తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ హరిబాబు, సీడీపీఓలు రేఖల మమత, చంద్రకళ, అంగన్‌వాడీ టీచరు చిన్నమ్మ తదితరులున్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నకిరేకల్ : అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, విధి నిర్వహణలో టీచర్లు, ఆయాలు నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ ఆదేశించారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్‌గూడెంలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు నమోదు, ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలు సమయపాలన పాటిస్తూ చిన్నారుల ఎన్‌రోల్‌మెంట్ పెంచాలన్నారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, సీడీపీఓ ఆగా అస్త్ర అంజూమ్, సూపర్‌వైజర్ సునీత, అంగన్‌వాడీ టీచర్ లతీఫా ఉన్నారు.
రాష్ట్ర సీ్త్ర, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్
Comments
Please login to add a commentAdd a comment