ముఖ్యమంత్రికి సీపీఐ ధన్యవాదాలు
సీపీఎం హర్షం
నల్లగొండ టౌన్ : జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని సీపీఎం స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలో దొడ్డి కొమురయ్య భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జూలకంటి మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, శ్రీశైలం, సయ్యద్ హశం, ప్రమీల, ప్రభావతి, లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నల్లగొండ టౌన్ : డిండి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రూ.1800 కోట్లు కేటాయించినందుకు సోమవారం సీపీఐ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్లోరైడ్‌తో మగ్గిపోతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, ఉన్నారు. వారి వెంట నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment