వీఎల్‌ఓకు 378.. సర్వేయర్‌కు 48
నల్లగొండ : ఇతర శాఖలకు బదలాయించిన వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా వీఎల్‌ఓ (విలేజ్ లెవల్ ఆఫీసర్) పోస్టులను సృస్టించింది. రెవెన్యూ శాఖలోని వీఎల్‌ఓ, సర్వేయర్ పోస్టుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి గత డిసెంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే జిల్లా వ్యాప్తంగా వీఎల్‌ఓకు 378, సర్వేయర్‌కు 48 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇతర శాఖలకు వెళ్లిన వారు 1080 మంది
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ధరణి తెచ్చే ముందు 2022 ఆగస్టు 1వ తేదీన వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసింది. జిల్లాలో ఉన్న 390 మంది వీఆర్‌ఓలను ఇతర శాఖలకు బదలాయించారు. అదే విధంగా 2023 ఆగస్టు 10న వీఆర్‌ఏ వ్యవస్థను కూడా రద్దు చేసింది. జిల్లాలో వీఆర్‌ఏలుగా పని చేస్తున్న 690 మందిని ఇతర శాఖలకు పంపింది.
జిల్లాకు చేరిన జాబితా..
రాష్ట్ర ప్రభుత్వం పాత వీఆర్‌ఓ, వీఆర్‌ఏల్లో సొంత శాఖలోకి రావాలనుకునే వారి నుంచి దరఖాస్తులు తీసుకోగా.. వీఎల్‌ఓ పోస్టుకు 378 మంది, సర్వేయరు పోస్టుకు 48 మంది దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాకు జాబితా వచ్చింది. వచ్చిన దరఖాస్తుల్లో డిగ్రీ పూర్తి చేసిన, ఇంటర్ పూర్తయిన వారు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు.
రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు వీఆర్‌ఏలు, వీఆర్‌ఓల దరఖాస్తు
Comments
Please login to add a commentAdd a comment