శ్రీశైలం: ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఈఓ పెద్దిరాజు కోరారు. బుధవారం ఆయన దేవస్థానం పరిపాలన విభాగంలో సత్రాల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులు వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులను తిని జంతువులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించరాదని ఆదేశించారు. ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ ఫోర్క్‌లు, ప్లాస్టిక్ కప్పులు తదితరవాటిని పూర్తిగా నిషేధించామన్నారు. మట్టి, స్టీల్, రాగి, గాజు పాత్రలను వినియోగించాలన్నారు. ఈ ఆదేశాలను క్షేత్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సత్రాల యజమానులు పాటించాలన్నారు. ఆయా సత్రాలకు వచ్చే భక్తులకు భోజనానికి అరటి ఆకులు, విస్తర్లు ఉపయోగిచాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ, శానిటేషన్, రెవెన్యూ ఏఈఓ మల్లికార్జున రెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, సెక్యూరిటీ విభాగం అధికారి అయ్యన్న, రెవెన్యూ సూపరింటెండెంట్లతో పాటు ఏపీఆర్వో శివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment