ఉల్లి రైతుల సమస్యలు పట్టించుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం చేతకాక.. సరుకు ఎక్కువగా వస్తోందని సాకులు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కమీషన్‌లపై చూపుతున్న శ్రద్ధలో కనీసం 40 శాతం రైతు సమస్యలపై దృష్టి పెడితే రైతులకు ఇబ్బందులు ఉండవన్నారు. బుధవారం ఆయన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. పంటను అమ్ముకోవడానికి మూడు, నాలుగు రోజులు పడుతోందని, అంతలోగా ఉల్లిగడ్డలు కుళ్లిపోయి ధరపై తీవ్ర ప్రభుత్వాం చూపుతోందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా వస్తున్నపుడు ఉదయం 9 నుంచే టెండరు ప్రక్రయ చేపడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలో ఐదేళ్లు దాదాపు అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం ఉల్లి రైతుల ఇబ్బందులపై మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో సమావేశమై చర్చించారు.
టీడీపీ నేతలు లిక్కర్ షాపులతో
బిజీగా ఉన్నారు
టీడీపీ నాయకులు లిక్కరు షాపులు, కమీషన్‌ల వేటలో బిజీగా ఉన్నారని కాటసాని విమర్శించారు. రైతు సమస్యలపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి, కల్లూరు ఎంపీపీ శారద తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment