విద్యాభివృద్ధికి కృషి చేయండి
● డీఈఓ జనార్దన్‌రెడ్డి
నంద్యాల(న్యూటౌన్): విద్యాభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఎంఈఓలకు సూచించారు. బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్కూల్ కాంప్లెక్స్, పేరెంట్స్ మీటింగ్, వృత్యంతర శిక్షణ, టీచర్స్ మేళా, అపార్ ఐడీస్, పని సర్దుబాటు, పీఎంశ్రీ పాఠశాలలు, పాఠశాల మౌలిక వసతులపై ఏర్పాటు చేసిన ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజనం, ఆయాల పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించేందుకే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారి మహమ్మద్ బేగ్, సర్వశిక్ష అభియాన్ అధికారి లలిత, ఉర్దూ డీఏ అస్మోద్దీన్ పాల్గొన్నారు.
31.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాలలో మంగళవారం నుండి బుధవారం వరకు 31.917 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.304 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.613 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 39,238 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 97,154 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 31,222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 199.7354 టీఎంసీల నీరు ఉంది. డ్యాం నీటి మట్టం 882.10 అడుగులకు చేరుకుంది.
అమరుల త్యాగాలు మరువలేనివి
నంద్యాల(సిటీ): పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీనివాస సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment