స్వీయ సత్ప్రవర్తనతోనే అవినీతి నిర్మూలన
●
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: అవినీతిని అంతమొందించే ప్రక్రియ స్వీయ సత్ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 3 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం సమకూర్చేందుకు కేజీకి రూ.40 ప్రభుత్వానికి ఖర్చవుతుందన్నారు. ఈ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా కార్డుదారులు ఇతరులకు విక్రయించుకుంటుండటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలు, రసాయనిక ఎరువులతో రైతులను రైతులే మోసం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ పనులు చేయించుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రతి సంస్థలో విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ వ్యక్తుల దృక్పథంలో మార్పు రానంతవరకు అవినీతి కొనసాగుతూనే ఉంటుందన్నారు. జేసీ విష్ణుచరణ్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ, అగ్నిమాపక అధికారి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రమణ, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, విజిలెన్స్ ఇన్‌చార్జ్ డీఎస్పీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment