ధర పడిపోయింది
ఏడాది పొడువునా తోటల్లో చాకిరీ చేసేది.. ఈ మూడు నెలల్లో ధరలు బాగా పెరుగుతాయని ఆశతోనే. మొదటి కాపు పెట్టుబడికి పోయినా ఈ మూడు నెలల్లో వచ్చే రెండో కాపుతోనే కాస్త ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సీజన్‌లో ధరలు పడిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. నిమ్మకాయల అమ్మకాలకు జిల్లాలో మార్కెట్ సదుపాయం లేకపోవడంతోనే దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. – రమేష్, మర్రిపల్లె
జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
ఐదేళ్ల నుంచి నిమ్మ సాగు బాగా పెరుగుతోంది. నేను ఐదు ఎకరాల్లో నిమ్మచెట్లు నాటుకున్నాం. నిమ్మకాయల అమ్మకాలకు జిల్లాలో ఎక్కడా మార్కెట్ సదుపాయం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రైతులే నేరుగా జ్యూస్ ఫ్యాక్టరీల వద్దకు వెళ్లి అమ్ముకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. దగ్గరలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.
– ఈశ్వరయ్య, కోటకందుకూరు
వాళ్లు అడిగినంతకే ఇస్తున్నాం
నిమ్మ తోటల సాగుదారులం ఎవరమైనా వాటిని మార్కెట్‌కు తెచ్చేవరకే మాకు వాటిపై హక్కు. ఇక్కడికి తెచ్చిన తరువాత వ్యాపారులు ఎంత చెబితే అంతకే ఇవ్వాల్సి వస్తోంది. పైన ఎంత ధర పలుకుతున్నా మాకు మాత్రం వీళ్లు ఇచ్చిందే తీసుకోవాలి. ఏం చేస్తాం తోటలో కుళ్లిపోతుంటే చూస్తూ ఉండలేక తెంపుచుకుని వచ్చి వీళ్లకు ఇచ్చిపోతున్నాం. – గోపాల్‌రెడ్డి, కృష్ణాపురం
దళారులు లేకుండా చూసుకోవాలి
రైతులు అదంరూ ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితే నేరుగా మార్కెట్ వారితో అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో దళారీ వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాగుదారులు అందరూ అందులో సభ్యులు చేరి దళారి వ్యవస్థ లేకుండా చూసుకోవాలి.
– నాగరాజు, జిల్లా ఉద్యానశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment