నంద్యాలటౌన్: క్షయ వ్యాఽధి నిర్మూలన కోసం 18 ఏళ్లు పైబడిన వయోజనులకు గురువారం నుంచి అన్ని సచివాలయాల్లో బీసీజీ టీకా వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సచివాలయాల వారిగా సీహెచ్‌ఓలు, ఆశా, ఏఎన్‌ఎం, టీబీ చాంపియన్లు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన సర్వేలో ఐదేళ్ల నుంచి టీబీ మందులు వాడి వ్యాధి నయమైనవారు, టీబీ వ్యాధిగ్రస్తులకు, షుగర్ పేషంట్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి సచివాలయాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం బీసీజీ టీకాలను వేస్తామన్నారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. టీకా వేయించుకున్న వారిని ఆశా, ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment