ఆధునిక వ్యవసాయంపై చైతన్య పరచాలి
నంద్యాల(అర్బన్): ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులను చైతన్యం చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ విల్సన్ అన్నారు. స్థానిక కార్యాలయంలో జిల్లా వనరుల కేంద్రం ఉప వ్యవసాయ సంచాలకులు సరళమ్మ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్ క్షేత్రస్థాయి సిబ్బంది, వ్యవసాయాధికారులకు నైపుణ్య సామర్థ్యం పెంపుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఏఓ మురళీకృష్ణ, ఏడీఆర్ విల్సన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అందించాలన్నారు. అలాగే..శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించాలని, అప్పుడే వారు పంటల సాగులో అధిక దిగుబడులు సాధించగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రాజశేఖర్, వ్యవసాయాధికారులు ప్రసాదరావు, హేమసుందర్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, స్వాతి, వీఏఏలు, వీహెచ్‌ఏలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment