లింక్ లేకుంటే రాయితీ లేనట్లే!
● బ్యాంక్ ఖాతాకు ఎన్‌పీసీఐ
లింక్ తప్పని సరి
● ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
● జిల్లాలో 1.94 లక్షల ఖాతాలకు
అనుసంధాన కార్యక్రమం
● ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియ
గోస్పాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందించే రాయితీలకు ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ తప్పనిసరి చేశాయి. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఎన్‌పీసీఐ లింకు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్‌సీపీఐ లింకు ఉన్న బాం్యక్ ఖాతాలు లేకపోవటంతో ప్రభుత్వాల నుంచి వారికి పథకాలు అందకుండా పోయాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్‌పీసీఐ లింకులు లేని ఖాతాల జాబితాలను ఆయా ప్రాంతాల వారీగా అధికారులకు పంపించి వాటిని వెంటనే లింక్ చేయించాలని ఈనెల 6వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులతో పాటు 18 ఏళ్లు నిండివారితో పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాలు తెరిపించే బాధ్యతను సచివాలయ సెక్రటరీ, వెల్ఫేర్, మహిళాసంరక్షణ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సర్వేయర్లు, అగ్రికల్చర్ సిబ్బందికి అప్పగించారు.
బ్యాంక్ ఖాతాకు
ఆధార్ అనుసంధానం తప్పనిసరి..
ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ఏ సంక్షేమ పథకమైనా లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంకు ఖాతా మనుగడలో ఉండాలి. కొందరికి ఒకటి నుంచి రెండు, మూడు బ్యాంక్ ఖాతాలు ఉండి వాటిలో కొన్ని వినియోగంలోకి లేకపోవడంతో సమస్యలు లెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనుగడలోలేని ఖాతాల వివరాలు పునరుద్ధరించుకునేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,94,424 మందికి పైగా ఖాతాదారులకు ఎన్‌పీసీఐ లింక్ లేనట్టు గుర్తించారు. వారందరికీ అధికారుల ద్వారా సమాచారం అందించి లింక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ఖాతాదారులు ఎన్‌పీసీఐ
చేయించుకోవాలి
ప్రతి బ్యాంకు ఖాతాదాదారులు అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింక్ ఉందా లేదా అని సరి చూసుకోవాలి. లేకపోతే ప్రత్యేక క్యాంపుల ద్వారా లింక్ చేస్తున్నాం. జిల్లాలో ఎన్‌పీసీఐ లింకులేని వారి జాబితాలోని వారందరికీ ఎన్‌పీసీఐ లింక్ పూర్తి చేసేలా సంబంధిత శాఖ ద్వారా చర్యలు చేపట్టాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
–శివారెడ్డి, డీఎల్‌డీఓ, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment