35వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం
రుద్రవరం: రాష్ట్రంలో ఈ ఏడాది 35వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు ప్రభుత్వ లక్ష్యమని ఉద్యానవన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ బాలాజీ నాయక్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దకంబలూరు మెట్ట వద్ద ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రవరం మండలంలో 12 ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో నర్సరీలో మొక్కలను పెంచుతున్నారన్నారు. అక్కడి నుంచి రైతులకు మొక్కలు సరఫరా చేయిస్తామన్నారు. 2024–25 ఏడాదిలో ఆయిల్ ఫామ్ నర్సరీల నిర్వాహణకు ప్రభుత్వం రూ.380 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయన వెంట ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నాగరాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment