విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మహానంది: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. తిమ్మాపురం పీహెచ్‌సీని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఏపీ మోడల్ స్కూల్‌కు చేరుకుని ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా వైద్య సేవల వివరాలతో రికార్డులు ఇస్తామన్నారు. బీపీ, షుగర్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను వాటిలో పొందుపరిచి అవసరమైన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. జిల్లాలోని గ్రామాల్లో 30 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది చేస్తున్న క్యాన్సర్ పరీక్షల్లో భాగంగా ఓరల్ క్యాన్సర్ తొమ్మిది, బ్రెస్ట్ క్యాన్సర్ 3, సర్వైకల క్యాన్సర్ మూడు గుర్తించామన్నారు. ఓరల్ క్యాన్సర్‌లో 2,598 మంది, బ్రెస్ట్ క్యాన్సర్ 373 మంది, సర్వైకల్ కాన్సర్‌లో 161 మంది అనుమానితులుగా గుర్తించామని, మరిన్ని పరీక్షల అనంతరం నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. అవసరమైన వారికి ఎన్‌టీఆర్ ట్రస్ట్ సేవా ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఆయన వెంట డాక్టర్ భగవాన్‌దాస్, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, ఎంపీహెచ్‌ఈఓ హుసేన్‌రెడ్డి ఉన్నారు.
డీఎంఅండ్‌హెచ్‌ఓ
డాక్టర్ వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment