వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. వలంటీరు వ్యవస్థే లేదని మంత్రి చెప్పడం తగదు. ఎన్నికల ముందు వలంటీర్లకు జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేయడం పద్ధతి కాదు.
– బాలవెంకట్, సీఐటీయూ సెక్రటరీ, నంద్యాల
హామీలు నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం ఎన్నిక హామీలను వెంటనే నెరవేర్చాలి. ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి. పాఠశాలలో పనిచేసే చిన్న స్థాయి వర్కర్లను, గ్రామాలలో ఫీల్డ్‌అసిస్టెంట్లు వంటి చిరుద్యోగులను తొలగిస్తున్నారు. ఇలాంటివి వెంటనే మానుకొని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. హాలు అమలు చేయకుండా ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. – ప్రసాద్, కార్యదర్శి, సీపీఐ, నంద్యాల
ప్రభుత్వంపై
ప్రజల్లో అసమ్మతి
ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడవక ముందే ప్రజల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. సూపర్‌సిక్స్ అంటూ ఎన్నో మాయమాటలు చెప్పి చంద్రబాబు గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు రోడ్డెక్కి తమ సమస్యలు పరిష్కారించాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాఽథుడేలేరు.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment