వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆళ్లగడ్డ: ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ జనార్దనరెడ్డి సూచించారు. మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, బాలికల వసతి గృహాలను ఆయన బుధవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మోడల్ స్కూల్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు.
శ్రీశైలం నుంచి 41,744 క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి 41,744 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు విడుదల చేశారు. తెలంగాణ ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 13.664 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అనంతరం నాగార్జునసాగర్‌కు 30,733 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 7,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,611 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి జలాశయంలో 133.6290 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 868 అడుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment