గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు అనే పదమే వినిపించలేదు. మూడు దఫాలుగా ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన, వసతి దీనెవల కింద ఫీజు చెల్లిస్తుండడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించారు. అయితే కూటమి సర్కార్ వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నోరు మెదపడంలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజు కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
నిత్యావసరాల ధరలు తగ్గించాలని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసరవస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. బియ్యం కేజీ రూ.80 వరకు, ఆయిల్ లీటర్ రూ.200, బ్యాళ్లు రూ.180 వరకు పెరిగిపోవడంతో ఆందోళనలు ఉద్ధృతంగా జరిగాయి.
సూపర్ సిక్స్ హామీల కోసం..
ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయా లని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇవ్వాలని, మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వా లని, రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని, ఉచి త బస్సు ఎక్కించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న డిమాండ్లతో రోజూ ఆందోళనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment