పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వీడండి
దొర్నిపాడు: ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందించడంలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. బుధవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నె, డబ్ల్యూ కొత్తపల్లె, చాకరాజువేముల గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. ఎంతమంది చిన్నారులు, గర్భిణులు ఉన్నారని ఆరా తీశారు. గర్ణిణులు, బాలింతలకు అందించే పోషన్ అభియాన్ కిట్లను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. గుడ్లు ఇవ్వలేదని తెలుసుకుని కార్యకర్తలను ప్రశ్నించగా వారు ఏజెన్సీ వాళ్లు సరఫరా చేయలేదని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. ముందుగా తెప్పించుకోవాల్సిన బాధ్యతా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనతంరం గ్రామ సచివాలయాలను తనిఖీ చేసి పంటల బీమా ప్రిమియం చెల్లింపుపై ఆరా తీశారు. ప్రతి రైతు పంట బీమా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. చాకరాజువేముల ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూంచించారు.
1,169 గృహాలు పూర్తి కావాలి
నంద్యాల: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూప్, ఆర్‌సీ స్థాయిలో ఉన్న 1,169 గృహాలు డిసెంబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి హౌసింగ్ డీఈ, ఏఈలనులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని మండలాల నుంచి లబ్ధిదారుల జాబితాను రెండు రోజుల్లో పంపడంతోపాటు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశాలు నిర్వహించుకుని రోజువారీ లక్ష్యా న్ని చేరుకోవాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా రూ.లక్ష రుణ మంజూరుకు చర్యలు తీసుకుంటానన్నారు. పూర్తయిన ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Comments
Please login to add a commentAdd a comment