సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
వెలుగోడు: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాణ్యమైన దిగుబడిని సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి వైవీ మురళీకష్ణ అన్నారు. మండలంలోని అబ్దుల్లాపురం గ్రామంలో ఏఓ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలన్నారు. దీని వల్ల నాణ్యమైన దిగుబడితో పాటు నేలలో కర్బన శాతం, సూక్ష్మ పోషకాలు పెరుగుతా యని తెలిపారు. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకూడదని, పంట మార్పిడి చేయాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టరు జోత్స్న, సెరికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment