ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
డోన్ టౌన్: ఖైదీలు జైళ్లలో సత్ప్రవర్తనతో మెలగాలని కర్నూల్ డిస్ట్రిక్ లీగల్ సర్వీసు అథారిటీ సెక్రెటరీ, న్యాయమూర్తి బి.లీలావెంకట శేషాద్రి సూచించారు. మంగళవారం డోన్ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు ఉచిత న్యావసేవలు అందిస్తున్నామని, అవసరమైన వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్,లీగల్ అడ్వయిజర్ న్యాయవాది మాధవస్వామి, సబ్ జైలు సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
బనగానపల్లె రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం బనగానపల్లెలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తర్వాత రామక్రిష్ణాపురం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు స్వరూప, శ్రీనివాసులు, హెచ్‌ఎంలు బాలగంఽగధర్‌రెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment