868.80 అడుగులుగా శ్రీశైల డ్యాం నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

868.80 అడుగులుగా శ్రీశైల డ్యాం నీటిమట్టం

Published Wed, Nov 27 2024 7:46 AM | Last Updated on Wed, Nov 27 2024 7:46 AM

868.80 అడుగులుగా  శ్రీశైల డ్యాం నీటిమట్టం

868.80 అడుగులుగా శ్రీశైల డ్యాం నీటిమట్టం

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైల జలాశయ నీటిమట్టం మంగళశారం సాయంత్రం సమయానికి 868.80 అడుగులకు చేరింది. జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. 136.6026 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం నుంచి మంగళవారం వరకు సుంకేసుల నుంచి 2,013 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 45,339 క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఎడమగట్టు కేంద్రంలో 15.298 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

ఈవీఎంలపై విమర్శలు చేయొద్దు

నంద్యాల: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కేఏ పాల్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈ మేరకు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఈవీఎంల విశ్వనీయతపై విమర్శలు చేయరాదన్నారు.

శాస్త్రోక్తంగా ఏకాదశి ఉత్సవం

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ఽ వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య దూపదీపాలతో మహా మంగళహారతి నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్లు పల్లకీపై కొలువుదీరి తిరువీధిలో విహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement