రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
● భారత రాజ్యాంగ దినోత్సవంలో మాజీ ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల(అర్బన్):ప్రజాస్వామ్య పరిరక్షణకు దిక్సూచి అయిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మాజీ ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డా.బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసాతో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించే విధంగా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు పాంషావలి, గంగిశెట్టి శ్రీధర్, నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, చంద్రశేఖర్, ఆరిఫ్‌నాయక్, సమ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment