పాణ్యం : టీడీపీ నాయకులు బరితెగించారు.నచ్చనివారిపై దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు.తాజాగా మండల పరిధిలోని గగ్గటూరు గ్రామంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ముల్లా ఉసేన్బాషాపై ఆదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈనెల 27న సామాజిక బహిరంగ సభ ఉండడంతో గ్రామాల్లో సోషల్ ఆడిట్ సిబ్బంది పర్యటించి సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉందని ఫీల్డ్ అసిస్టెంట్ విధుల నుంచి తప్పుకోవాలని సభ వద్దే అందరి ముందు టీడీపీకి నాయకులు ముల్లా ఉసేన్‌బాషాతో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆపార్టీకి చెందిన 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు మరో వ్యక్తిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు ముల్లా ఉసేన్‌బాషా మంగళవారం కుటుంబసభ్యలతో కలిసి పాణ్యం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment