ఇద్దరు మట్కాబీటర్ల అరెస్ట్
ఆదోని అర్బన్: ఇద్దరు మట్కా బీటర్లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.15 లక్షల నగదు, 10 లీటర్ల నాటు సారా, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రామలింగమయ్యతో కలిసి డీఎస్పీ సోమన్న విలేకరులకు వెల్లడించారు. ఈనెల 1న పట్టణానికి చెందిన ఇద్దరు మట్కా బీటర్లు అలీహుసేన్, ఈరప్పలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.35 వేల నగదు, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వారిచ్చిన సమాచారంతో ఇదే కేసులోని మరో ఇద్దరు మట్కా బీటర్లు ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, ఆదోనికి చెందిన చాంద్‌బాషాపై నిఘా ఉంచారు. ఈక్రమంలో ఆస్పరి బైపాస్ రోడ్డులో ఉండగా అరెస్టు చేసి, వారి నుంచి రూ.2,15,600 నగదు, సెల్‌ఫోన్, పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు.
రూ.2.15 లక్షల నగదు, సెల్‌ఫోన్,
10 లీటర్ల నాటుసారా స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment