విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని వైద్య విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవా లని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సూచించారు. సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీ మెన్స్ హాస్టల్‌లో మత్తు పదార్థాలపై వైద్య విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. మత్తు పదార్థా ల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరో గ్యం పూర్తిగాచెడిపోవడమే గాక బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరమవుతారని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ సాయిసుధీర్, డాక్టర్ విజయ్ ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment