పెళ్లి వేడుకపై దాడి అనాగరికం
సి.బెళగల్: బ్రాహ్మణదొడ్డిలో పెళ్లి వేడుకపై దాడి చేసి, నూతన వధువరులు, వారి బంధువులను తీవ్రంగా గాయపరచడం అనాగరిక చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన ఆదివారం సి.బెళగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధిత కుటుంబాల మహిళలను పరామర్శించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బాధితులు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. పెళ్లి వేడుకలో భాగంగా వైఎస్సార్‌సీపీ వర్గీయులు జరుపుకుంటున్న ఊరేగింపు (మెరవని)పై దుండగులు రాళ్లు, ఇనుపరాడ్లు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడటం అనాగరికమైన చర్య అన్నారు. అనంతరం బాధిత కుటుంబాల మహిళలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడిలో గాయపడిన వారు చావుబతుకుల మధ్య ఉంటే వారి కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు తీసుకురావడం సరికాదని ఆక్షేపించారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలలో తమకు పోటీ ఉండకూడదని హెచ్చరికలతో అధికార పార్టీ అండ చూసుకొని దుండగులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment