తెలుగు భాషా సేవకుడికి పురస్కారం
ఆదోని అర్బన్: ప్రముఖ జ్యోతిష్యవేత్త, ఉపాధ్యాయుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మకు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఆయన ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా దాదాపు 23 సంవత్సరాలుగా తెలుగు భాషకు కరసేవకుడిగా సేవలందిస్తున్నారు. గరుడాద్రి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏటా తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తూ విశ్రాంత ఉపాధ్యాయులు, విలేకరులను సత్కరించేవారు. విద్యార్థులకు తెలుగు భాషలో అనేక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేయడం, తెలుగు క్రీడ కబడ్డీని ప్రోత్సహిస్తూ జెర్సీలను అందజేయడం, విజేతలకు వెండి పతకాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా వసంత పంచమి పండుగను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం–2025, కాంస్య నంది అవార్డును సన్మాన పత్రాన్ని ఇచ్చి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment