ఎన్‌ఎస్‌టీఆర్‌లో గడ్డి మైదానాలు
నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్)లో 1,33,122 హెక్టార్లలో గడ్డి మైదానాలు ఉన్నాయి. వీటిలో ఏకదళ, ద్విదళ గడ్డి జాతులు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఎస్‌టీఆర్ చుట్టూ సుమారు 200 గ్రామాలు అడవిని ఆనుకుని ఉన్నాయి. వీటిల్లో సుమారు ఆరు లక్షల ఆవులు, బర్రెలు ఉన్నాయి. ఇవన్నీ నల్లమలలోని గడ్డి మైదానాలను వన్యప్రాణులతో కలిసి పంచుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌టీఆర్‌లోయేడాదికి గడ్డి లభ్యత 3,86,053 టన్నులుగా ఉంది. గడ్డి తినే వన్యప్రాణుల సంఖ్యతో పోలిస్తే ఏటా 6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం ఉంది. గ్రామీణ పశు సంపద నుంచి ఉన్న పోటీ కారణంగా 3.073 టన్నుల గడ్డి ఏటా అదనంగా ఉత్పత్తి కావాల్సిన అవసరముంది. దీంతో డిమాండ్‌కు సప్లయ్‌కి మధ్య తేడా భారీగా కనబడుతోంది. దీంతో పులి ఆహార జంతువులైన జింకలకు అవసరమైన మేర గడ్డి మైదానాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామీణ పాడి పశువులను స్టాల్ ఫీడింగ్‌కు పరిమితం చేస్తూనే పెరుగుతున్న హెర్బీవోర్స్ దామాషాకు సరిపడా గడ్డి మైదానాలలో గడ్డి ఉత్పత్తికి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment