మహబూబ్‌నగర్ న్యూటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా అందించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి చత్రునాయక్ బుధవారం ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంపికై న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందిస్తుందని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా http://overseas.tribal.gov.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment