చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఈఓ ఎండీ అబ్దుల్‌ఘని అన్నారు. మండలంలోని సింగారం గురుకుల స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ ఖోఖో అండర్ – 14 క్రీడాపోటీలను నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన టాస్ వేసి క్రీడలను ప్రారంభించి బాల, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీలు స్నేహ బావాన్ని పెంపొందిస్తాయని, పోటీతత్వం పెంచుతాయన్నారు. గెలుపు, ఓటమిలను సమాంతరంగా తీసుకుకోవాలని కోరారు. ఆటల్లో రాణిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక కోటా పొందవచ్చన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, డీవైఎఫ్‌ఐ వెంకటేష్, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీ నర్సింహులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ రమణ, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment